బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి – సిపిఐ

Homeతెలంగాణ

మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి – సిపిఐ

మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి – సిపిఐ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అనేక గ్రామాలక

తుగ్గలి, మామిళ్లకుంట గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు
మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఘన సన్మానం

మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి – సిపిఐ

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అనేక గ్రామాలకు సరైన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ ఆవేదన వ్యక్తం చేశారు.గిరిపురం గ్రామంలో నిర్వహించిన సిపిఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలు, రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. బస్సులు లేక ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతూ అధిక ఖర్చులు భరించాల్సి వస్తోందని, రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అనేపురం, బీచరాజుపల్లి, చిల్లంచర్ల, ధర్మారం, ఎడ్జెర్ల, గాలివారిగూడెం, గిరిపురం, గుండెపూడి, నీలకుర్తి, రాంపురం, తాళ్ల ఊకల్, ఉల్లేపల్లి, వీరారం, యల్లంపేట గ్రామాలకు తక్షణమే ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి అన్ని గ్రామాలకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రజలకు అనుకూలంగా బస్సులు నడపాలని కోరారు. ప్రజా రవాణా ప్రజల హక్కు.. అది ప్రభుత్వ బాధ్యత. హామీలతో కాలయాపన చేయకుండా తక్షణమే అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి. లేనిపక్షంలో ప్రజల తరఫున సిపిఐ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అంజి, వీరేందర్, రమేష్, వీరన్న, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: