బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పదవి కోసం కాదు. దేశం కోసం జీవించిన మహానాయకుడు” లాల్ బహదూర్ శాస్త్రి: ముత్యం వెంకన్న గౌడ్ 36 వ వార్డ్ కౌన్సిలర్

Homeతెలంగాణ

పదవి కోసం కాదు. దేశం కోసం జీవించిన మహానాయకుడు” లాల్ బహదూర్ శాస్త్రి: ముత్యం వెంకన్న గౌడ్ 36 వ వార్డ్ కౌన్సిలర్

పదవి కోసం కాదు. దేశం కోసం జీవించిన మహానాయకుడు" లాల్ బహదూర్ శాస్త్రి: ముత్యం వెంకన్న గౌడ్ 36 వ వార్డ్ కౌన్సిలర్ ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడ

ఎస్‌ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న స్విమ్మర్ రాజు
చిన్నారితో అక్షరాభ్యాసం నిర్వహించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి

పదవి కోసం కాదు. దేశం కోసం జీవించిన మహానాయకుడు” లాల్ బహదూర్ శాస్త్రి: ముత్యం వెంకన్న గౌడ్ 36 వ వార్డ్ కౌన్సిలర్

ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

నమస్తే భారత్ :-మహబూబాబాద్

భారత మాజీ ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలను నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో మానుకోటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ మున్సిపాలిటీ 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న గౌడ్ హాజరై లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముత్యం వెంకన్న గౌడ్ మాట్లాడుతూ, లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ, నిరాడంబరత, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన మహనీయుడని అన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినా, చివరి వరకు సామాన్యుడిలా జీవించిన గొప్ప నాయకుడని కొనియాడారు.రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడులోని అరియలూర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని గుర్తుచేశారు. పదవి అంటే అధికారం కాదని, ప్రజల పట్ల బాధ్యత అని తన ఆచరణతో నిరూపించారని అన్నారు.నేటి తరానికి శాస్త్రి నిజాయితీ, బాధ్యత, నిరాడంబరత ఆదర్శంగా నిలవాలి. ఆయన ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి” అని,పదవి కోసం కాదు.దేశం కోసం జీవించిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని, సైనికుడిని, రైతును సమానంగా గౌరవించి దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు. ఆయన నిజాయితీ, దేశభక్తి, సేవాభావాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి” అని ముత్యం వెంకన్న గౌడ్ అన్నారు.అదేవిధంగా నేతాజీ సేవా సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
చిన్నతనంలో పాఠశాలకు వెళ్లేందుకు గంగానదిని ఈదుకుంటూ వెళ్లిన సంఘటన ఆయన పట్టుదలకు నిదర్శనమని అన్నారు. పేదరికం నుంచి ఎదిగి దేశ ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నా, నిరాడంబర జీవనాన్ని మాత్రం వీడలేదని పేర్కొన్నారు.రైల్వేలో సామాన్య ప్రయాణికుల సౌకర్యాలపై శాస్త్రి ప్రత్యేక శ్రద్ధ చూపారని, ఆయన కాలంలో సాధారణ బోగీల్లో ఫ్యాన్ల ఏర్పాటు వంటి ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యత లభించిందని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలనే ఆలోచనకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.1965లో పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో దేశ ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ “జై జవాన్ – జై కిసాన్” అనే నినాదాన్ని దేశానికి అందించారని డాక్టర్ నాగరాజు గుర్తుచేశారు. ఆహార కొరత సమయంలో దేశ ప్రజలు సహకరించాలని కోరుతూ వారంలో ఒక పూట భోజనం మానుకోవాలని పిలుపునిచ్చిన నాయకుడు శాస్త్రి అని అన్నారు.దేశ ఆహార భద్రత కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఏర్పాటుకు దారితీసిన చర్యలకు శాస్త్రి గారి కాలంలో ప్రాధాన్యత లభించిందని డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో నేతాజీ సేవా సమితి ప్రధాన కార్యదర్శి కుదురుపాక వివేక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోనగిరి లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కన్వీనర్ సామ శ్రీనివాస్, డాక్టర్ కుమార్ నాయక్,
యాకయ్య, శ్రీనివాస్,స్థానిక ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: