శ్రీరాంపురం ఎంపీటీసీగా నెల్లిపూడి సుమతి విజయం జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచి విజయాన్ని సొంతం చేసుకున్న సుమతి కాకినాడ బ్యూరో కాకినాడ జిల్లా, యు
శ్రీరాంపురం ఎంపీటీసీగా నెల్లిపూడి సుమతి విజయం
జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచి విజయాన్ని సొంతం చేసుకున్న సుమతి
కాకినాడ బ్యూరో
కాకినాడ జిల్లా, యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి నెల్లిపూడి సుమతి విజయం సాధించారు. ముమ్మిడివారిపోడుకు చెందిన నెల్లిపూడి బ్రహ్మాజీ సతీమణి సుమతి జనసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. కూటమి నాయకులు, జనసేన శ్రేణుల సహకారంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆమెకు మద్దతు పలికారు. ఎన్నికల ఫలితాల్లో విజయం నమోదు కావడంతో గ్రామంలో ఆమె అనుచరులు, పార్టీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమైంది. ఎంపీటీసీగా ఎన్నికైన సుమతికి పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

COMMENTS