గంధంగూడా లో భారీ అగ్ని ప్రమాదం హైదర్షాకోట్ శివసాయినగర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన ఇల్లు నమస్తే భరత్ నవంబర్ 10 గండిపేట్ మండల్ రిపోర్టర్ శ్రీని
గంధంగూడా లో భారీ అగ్ని ప్రమాదం
హైదర్షాకోట్ శివసాయినగర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన ఇల్లు
నమస్తే భరత్ నవంబర్ 10 గండిపేట్ మండల్ రిపోర్టర్ శ్రీనివాస్ : హైదర్షాకోట్ పరిధిలోని శివసాయినగర్ ఫేజ్-3లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఫ్రిజ్ వద్ద షార్ట్‌సర్క్యూట్ జరగడంతో వాటర్ ప్యూరిఫైయర్‌కు మంటలు అంటుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తినష్టం సంభవించింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తల్లిదండ్రులు తమ కుమార్తెను పాఠశాలలో దింపేందుకు వెళ్లగా, సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న భర్త విధులకు వెళ్లారు. ఇంటి నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఇంటి యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆయన ఇంటికి చేరుకునే సమయానికి మంటలు ఇల్లంతా వ్యాపించి, ఇంట్లోని ఫర్నిచర్‌తో పాటు విలువైన వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఈ అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం తమను ఆదుకుని తగిన ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.
బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు హరీష్ గౌడ్ పరామర్శ
అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు హరీష్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, జరిగిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ ఘటనను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.

COMMENTS