*బోల్లారం వాసన్న కుంట కబ్జాలపై నీటి పారుదల ఎస్ఈ కి స్థానికుల పిర్యాదు* నమస్సే భారత్:సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా బోల్లారం గ్రామంలోని చారిత్రాత్మ
*బోల్లారం వాసన్న కుంట కబ్జాలపై నీటి పారుదల ఎస్ఈ కి స్థానికుల పిర్యాదు*

నమస్సే భారత్:సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా బోల్లారం గ్రామంలోని చారిత్రాత్మక వాసన్న కుంట చెరువుని 4 ప్రైవేటు పరిశ్రమలు అక్రమంగా ఆక్రమించి చట్ట విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని సదరు పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం సంగారెడ్డి జిల్లా నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కి వినతి పత్రం సమర్పించారు.కొన్నేళ్లుగా చెరువుల పరిరక్షణను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారులు తమ విధుల్లో విఫలమయ్యారని ఆరోపించిన గ్రామస్తులు,స్థానిక పర్యావరణం, భూగర్భ జలాలు మరియు శక్తి వనరుల పరిరక్షణ కోసం ఏకమై ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నామని, వెంటనే చెరువును సర్వే చేసి ఆక్రమణలను తొలగించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పిటిషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ చెరువుని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని చెరువులో కట్టిన అక్రమాల్ని గుర్తించి వెంటనే తొలిగించాలని డిమాండ్ చేసారు.

COMMENTS