బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రజా పాలనలో భాగం కావా?

Homeతెలంగాణ

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రజా పాలనలో భాగం కావా?

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రజా పాలనలో భాగం కావా? వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ వరంగల్ నవంబర్

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు
బైరాగిగూడ ఓల్డ్ విలేజ్‌లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి: సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రజా పాలనలో భాగం కావా?

వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ బత్తిని శ్రీనివాస్ గౌడ్

వరంగల్ నవంబర్ 6 (మల్లేష్ నమస్తే భారత్ ) : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, పూటకో మాట మారుస్తూ పేదింటి ఆడపడుచులను వంచిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు, వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించి పేద కుటుంబాల్లోని ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూత అందించారని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 13 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అర్హులైన యువతులకు రూ.1,00,116తో పాటు తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే అన్ని కులాలకు చెందిన వికలాంగ మహిళలకు రూ.1,02,500తో పాటు తులం బంగారం అందిస్తామని ప్రకటించిందన్నారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారురాలికి కూడా తులం బంగారం అందించలేదని ఆరోపించారు. వేలాది మంది ఆడపడుచులు సంవత్సరాలుగా ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

*పెండింగ్ దరఖాస్తులు ఎప్పుడు పరిష్కరిస్తారు*?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 3,65,000 దరఖాస్తులు అందగా, కేవలం 1,60,000 మంది లబ్ధిదారులకు మాత్రమే సుమారు రూ.1,600 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంకా రెండు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.2024 సంవత్సరంలో రూ.2,175 కోట్లు, 2025 సంవత్సరంలో రూ.3,683 కోట్లు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాలకు కేటాయించినట్లు పేర్కొంటూ, ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పథకాలకు స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, వాటి కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.గత మూడు సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి రూ.1,26,000 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.33,116 కోట్లు కేటాయించినట్లు పేర్కొంటూ, ఆయా శాఖలకు కేటాయించిన నిధుల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటిస్తూ, ఆ నిధులను అర్హులైన లబ్ధిదారులకు ఎందుకు అందించడం లేదో ప్రభుత్వం ప్రజలకు లెక్కలతో సహా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

*పెండింగ్ దరఖాస్తులకు వెంటనే నిధులు విడుదల చేయాలి*

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న రెండు లక్షలకు పైగా దరఖాస్తులకు వెంటనే నిధులు విడుదల చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బత్తిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన సుమారు 3,60,000 మంది ఆడపడుచులకు తులం బంగారం అందించాలని కోరారు.తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తూ, పేద కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0