బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తెలంగాణలో నేటి నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు

Homeతెలంగాణ

తెలంగాణలో నేటి నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు

తెలంగాణలో నేటి నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు వరంగల్ నవంబర్ 11( మల్లేష్ నమస్తే భారత్ ) : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ఆలోచనా శక్తి, శాస

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ వృద్ధుడి కుటుంబానికి బియ్యం,ఆర్థిక సహాయం
*ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సహకరించాలి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ*

తెలంగాణలో నేటి నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు

వరంగల్ నవంబర్ 11( మల్లేష్ నమస్తే భారత్ ) :
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ఆలోచనా శక్తి, శాస్త్రీయ దృక్పథం, ప్రయోగాత్మక నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సుధాకర్ తెలిపారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు పాఠశాల స్థాయిలో 2026 నవంబర్ 12వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయన్నారు.
ఈ పరీక్షలకు గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, సమకాలీన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు తగిన విధంగా సిద్ధం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సంబరాలు మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 21న మండల స్థాయి, నవంబర్ 28న జిల్లా స్థాయి, డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు ఘనంగా నిర్వహించనున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థుల్లో ప్రతి తరగతి నుంచి ఒక్కొక్కరిని, మొత్తం ముగ్గురిని మండల స్థాయి పోటీలకు పంపించాల్సి ఉంటుందని తెలిపారు.ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేసి చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక నాయకులు కోరారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: