బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

​గీతా విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Homeతెలంగాణ

​గీతా విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

​గీతా విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి ​చండూరు, నమస్తే భారత్ నవంబర్ 14: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం మనసును వినే సమాజం కావాలి
గుడుంబాను ఉక్కు పాదంతో నిర్మూలిస్తాం
సెప్టెంబరు 3,4 తేదీలలో సిపిఐ(ఎం) రాజకీయ  శిక్షణ తరగతులు..

​గీతా విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి

​చండూరు, నమస్తే భారత్ నవంబర్ 14:

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం చండూరులోని గీతా విద్యాలయం (E/M) పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తూ నెహ్రూ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.
​కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ పోలోజు నరసింహాచారి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి పౌరులు” అని పేర్కొంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

​జాతీయ స్థాయి నెహ్రూ అవార్డు ప్రదానం:

విద్యా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ పోలోజు నరసింహాచారి గారికి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘నెహ్రూ అవార్డు’ లభించింది. శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి కంబాలపల్లి శివలీల గారి చేతుల మీదుగా ఈ అవార్డును నరసింహాచారి గారికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: