బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలి

Homeతెలంగాణ

జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలి

జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలి నమస్తే భారత్ :-తొర్రూరు :జర్నలిస్ట్ హెల్త్ కార్డులు కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు అన్ని ప్రైవేటు కార్పోరేట్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులందరూ నమోదు చేసుకోవాలి
*ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ*
నున్న నారాయణ 10 వర్ధంతి ఘనంగా నిర్వహించారు

జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

:జర్నలిస్ట్ హెల్త్ కార్డులు కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు అన్ని ప్రైవేటు కార్పోరేట్ ఆసుపత్రుల్లో పరిమితి లేకుండా అన్ని రకాల ఉచిత వైద్య సేవలు సర్జరీలకు సైతం వర్తింపజేయాలని ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లకావత్ యాదగిరి నాయక్, సీనియర్ జర్నలిస్టు కొమ్మనబోయిన యాకయ్య లు ప్రభుత్వాన్ని కోరారు.ఇటీవల ప్రభాత ఉదయం తొర్రూరు వర్కింగ్ జర్నలిస్ట్ కొమ్ము దేవేందర్ కు చెస్ట్ పెయిన్ రాగా మంగళవారం ఆయన స్వగృహంలో కలిసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్ట్ తో పాటు అతని కుటుంబంలో ఎవరికి ఎలాంటి వైద్యమైన ఉచితంగా అందించాలని అన్నారు. అక్రిడిటేషన్ కార్డులు మాత్రం ఇచ్చారు కానీ హెల్త్ కార్డులు మాత్రం ఇవ్వడం లేదని తక్షణమే హెల్త్ కార్డులను అందజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జిలుకర రాజు, నల్లపు రాజు,జూలూరి కిరణ్, కుంభం మహేష్,నారోజు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: