బజరంగ్‌దళ్ ప్రముఖ్ జి. కుమారస్వామి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సేవ ప్రముఖ్ బండారి రమేష్‌కు ఆహ్వానం.. వివాహ వేడుకకు తప్ప
బజరంగ్‌దళ్ ప్రముఖ్ జి. కుమారస్వామి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత
విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సేవ ప్రముఖ్ బండారి రమేష్‌కు ఆహ్వానం..
వివాహ వేడుకకు తప్పక హాజరవుతానని శుభాకాంక్షలు
నమస్తే భారత్ షాద్ నగర్, నవంబర్, 06:
బజరంగ్‌దళ్ ప్రముఖ్ జి. కుమారస్వామి తన వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ.. విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సేవ ప్రముఖ్ బండారి రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.నవంబర్ 14వ తేదీన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని పద్మావతి కన్వెన్షన్‌లో కళ్యాణితో జి. కుమారస్వామి వివాహ మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో బండారి రమేష్‌ను కలిసి పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ వివాహ వేడుకకు తప్పక విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.ఈ సందర్భంగా బండారి రమేష్ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించి, జి. కుమారస్వామి దంపతులకు ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా తప్పక హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని ఆకాంక్షించారు.

COMMENTS