బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

బహువార్షిక పశుగ్రాస సాగుకు రూ. 55 వేల ప్రభుత్వ సాయం

Homeతెలంగాణ

బహువార్షిక పశుగ్రాస సాగుకు రూ. 55 వేల ప్రభుత్వ సాయం

బహువార్షిక పశుగ్రాస సాగుకు రూ. 55 వేల ప్రభుత్వ సాయం పశు వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ ఖానాపురం నవంబర్ 6(మల్లేష్ నమస్తే భారత్ ) : పశుగ్రాస అభివృద్ధ

పలు కుటుంబాలను పరామర్శించి బాధితులకు భరోసా కల్పించిన
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి… మెదక్ జిల్లా, పాపన్నపేట మండల్, నవంబర్ 11 (నమస్తే భారత్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

బహువార్షిక పశుగ్రాస సాగుకు రూ. 55 వేల ప్రభుత్వ సాయం

పశు వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్

ఖానాపురం నవంబర్ 6(మల్లేష్ నమస్తే భారత్ ) :
పశుగ్రాస అభివృద్ధికి ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశుధన మిషన్ (ఎన్‌ఎల్‌ఎం) ద్వారా పశుగ్రాస అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తున్నట్లు శాఖ వరంగల్ జిల్లా ఖానాపురం మండల వెటర్నరీ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్‌ఎల్‌ఎం పథకం కింద బహువార్షిక పశుగ్రాసం సాగు చేసే అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ. 55,000 ఆర్థిక సహాయం అందించనుందన్నారు.
ఈ పథకం ద్వారా కనీసం ఒక హెక్టారు (2.5 ఎకరాలు) విస్తీర్ణంలో మూడేళ్ల పాటు బహువార్షిక పశుగ్రాసాన్ని సాగు చేసే రైతులకు ఆర్థిక ప్రయోజనం కల్పించనున్నారు. పశుగ్రాస ఉత్పత్తిని పెంచడంతో పాటు పశుపోషణకు అవసరమైన మేతను అందుబాటులోకి తీసుకురావడం ఎన్‌ఎల్‌ఎం
పథకం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.పథకానికి అర్హత కలిగిన, ఆసక్తి ఉన్న రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, సాగునీటి వివరాలతో కూడిన ప్రొఫార్మా-III దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, పశుగ్రాస సాగుపై సాంకేతిక సలహాల కోసం రైతులు తమ స్థానిక ప్రభుత్వ పశువైద్యశాల నందు గాని పశు వైద్యధికారులను సంప్రదించవచ్చునన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: