బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయదారులు మున్సిపల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.*

Homeతెలంగాణ.

*దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయదారులు మున్సిపల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.*

*దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయదారులు మున్సిపల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.* *-సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్.* దీపావళి

*తుగ్గలి మండలంలో విషాదం*
రగిలే నిప్పు కణం.షహీద్ భగత్ సింగ్.డా.కుమార్ నాయక్ డుంగ్రోతు.
ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్

*దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయదారులు మున్సిపల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.*
*-సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్.*
దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా (టపాసుల) దుకాణాల నిర్వాహకులు మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ మరియు సంబంధిత అధికారుల నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ విక్రయాలు చేపట్టాలని కోరుతు నిజాంపేట్ సర్కిల్ మేనేజర్ రమేష్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్సులు పొందాలి. నిర్ణీత ప్రాంతాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలి వారు గుర్తు చేశారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దుకాణాల వద్ద అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. వారు కోరారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించకుండా విక్రయాలు జరపాలి. నిషేధిత బాణసంచా విక్రయించకుండా, నిర్ణీత సమయాల్లోనే వ్యాపారం నిర్వహించాలని వారు సూచన చేశారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి దీపావళి పండుగను ప్రమాదరహితంగా జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పొన్నకంటి దస్తగిరి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: