బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Homeతెలంగాణ

మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఖానాపురం, అక్టోబర్ 17 (మల్లేష్ నమస్తే భారత్) : మహిళలను ఆర్థికంగా అ

రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్డీఓ ఉమారాణికి వినతిపత్రం
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి.. కన్నీళ్లలో వెంకంపహాడ్! అన్న కలను నిజం చేస్తున్న తమ్ముడు ప్రశాంత్

మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

ఖానాపురం, అక్టోబర్ 17 (మల్లేష్ నమస్తే భారత్) :
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని నూతనంగా ఏర్పాటైన బాలు తండా గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షల నిధులతో, ధర్మారావుపేట గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులతో శనివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ధర్మరావుపేటలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు అందిస్తూ, వారు నైపుణ్యం కలిగిన రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. మహిళలు కోటి రూపాయలకు పైగా వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాకాల సరస్సు చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. సరస్సు కాలువల మరమ్మతులు, అభివృద్ధి కోసం రూ.150 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. నిధులు మంజూరైన వెంటనే ఈ యాసంగిలో రెండు కాలువలను సరస్సు నుంచి చివరి వరకు కాంక్రీట్‌తో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని, మిగిలిన కాలువలను వచ్చే యాసంగిలో పూర్తి చేస్తామని చెప్పారు.
ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. పాకాల వాగు నుంచి పైప్‌లైన్‌ ద్వారా గ్రామాలకు నీటిని సరఫరా చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామంలోని పలువురు రైతులకు భూమి పట్టాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ, సంబంధిత అధికారులతో మాట్లాడి భూముల సర్వే అనంతరం రైతులకు పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామానికి బస్సులు సరిగా రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన ఆర్టీసీ డీఎంతో మాట్లాడి గతంలో మాదిరిగా బస్సు ట్రిప్పులు నడిచేలా చూస్తానని హామీ ఇచ్చారు.బాలు తండా గ్రామపంచాయతీ భవనం, ధర్మారావుపేట మహిళా భవన నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత నాయకులు, అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమాల్లో నర్సంపేట
ఏఎంసీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు,ఖానాపురం సొసైటీ చైర్‌పర్సన్ వల్లే శ్రీనివాస్ యాదవ్,ఆత్మ చైర్మన్ ఎడ్లభిక్షంరెడ్డి, ధర్మరావుపేట సర్పంచ్ మాడ్రాజు వెంకన్న ,బాలు తండా గ్రామ సర్పంచ్ బానోత్ సునీత బాలకిషన్,
తహసీల్దార్ నంగునూరి రమేష్, ఎంపీడీవో వనపర్తి అద్వైత, పీసీసీ సభ్యులు పెండెం రామానంద్, సొంటి రంజిత్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,ఆశోక్ నగర్ సర్పంచ్ జాడి అచ్యుతం, బుధరావుపేట సర్పంచ్ పెసరు రాణిగోవర్థన్ రెడ్డి, వేపచెట్టుతండా సర్పంచ్ మూడు దేవేందర్, బండమీదితండాసర్పంచ్ బోడ రమేష్, బోటుమీదితండా సర్పంచ్ భానుప్రసాద్, సొసైటీ డైరక్టర్ శివరాత్రి వెంకన్న, దేవినేని వేణుగోపాల్ రావు,గట్టి సారంగపాణి, ప్రజాప్రతినిధులు, నాయకులు, ధర్మరావుపేట పంచాయతీ కార్యదర్శి ఎన్ .అనిత,బాలుతండా పంచాయతీ కార్యదర్శి పి.స్రవంతి, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల వీవోలు, సీఏలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: