బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*రైల్వే బ్రిడ్జికై తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరాహార దీక్ష*

Homeతెలంగాణ

*రైల్వే బ్రిడ్జికై తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరాహార దీక్ష*

*రైల్వే బ్రిడ్జికై తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరాహార దీక్ష* *రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుంటే ఖబర్దార్-టి ఆర్ పి ఇంచార్జి ఎమ్మె సంతోష్*

బీజేపీ విధానాలకు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలి
రోడా మేస్త్రి నగర్ డివిజన్,కృష్ణ వేణి హై స్కూల్ లో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు.
*ఎస్‌జీఎఫ్‌ వాలీబాల్‌లో ఇండియన్‌ హైట్స్‌ విద్యార్థుల సత్తా*

*రైల్వే బ్రిడ్జికై తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరాహార దీక్ష*

*రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుంటే ఖబర్దార్-టి ఆర్ పి ఇంచార్జి ఎమ్మె సంతోష్*

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్14:షాద్ నగర్ మున్సిపాలిటీ లో చటన్ పల్లి రైల్వే గేట్ వద్ద చటన్ పల్లి రైల్వే గేట్ నిర్మాణం పూర్తి చేయాలని రాజ్యాధికార పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ఉప్పరమోని రాములు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మె సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. షాద్నగర్ మున్సిపల్ లోని చటన్ పల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం వీలైనంత త్వరగా జ
పనులను ప్రారంభించాలని దానివల్ల నిత్యం రాకపోకలు సాగిస్తూ సుమారు 20 గ్రామాల ప్రజలు మరియు హైదరాబాదు తదితరుల పరిసర ప్రాంతాల నుండి ప్రజలు షాద్నగర్ టౌన్ కి రాకపోకలు సాగిస్తుంటారు కనుక సుమారు 150 కి పైగా ట్రైన్లు నిత్యం రాకపోకలను జరుగుతుంటాయి కనుక 15 20 నిమిషాలకు ఒకసారి రైల్వేగేటు వేయడం వల్ల ప్రజలకు ఎండలో వానలో 15 20 నిమిషాలకు కుటుంబ చిన్నపిల్లలతో బైకుల పైన వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేక ఇబ్బందులకు గురవుతారు వైద్యం నిమిత్తం అంబులెన్సులు రైల్వే గేట్ పడితే ప్రమాదం బారిన పడినటువంటి రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తాయి. గతంలో ప్రమాదాల బారిన పడినవారు ప్రాణాలను కోల్పోయారు మరియు గర్భిణీలు కాన్పులు అయినా పరిస్థితి కావున ఇప్పటికైనా వీలైనంత త్వరగా రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజల కష్టాలను తీర్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే ని డిమాండ్ చేయడమైనది లేనియెడల రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఇట్టీ కార్యక్రమానికి చటాన్ పల్లి, రాంనగర్ చుట్టుపక్కల గ్రామంలో ప్రజలు బీసీ సంఘం నాయకులు మరియు తదితరులు మద్దతు ఇవ్వడమైనది. నిరాహార దీక్ష విరమణ అనంతరం ఆర్ డి ఓ కార్యాలయం లో వినతి పత్రం అందజేయడంమైనది.
ఈ కార్యక్రమం లో షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు ఎమ్మె సంతోష్, తాలూకా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు జనార్దన్ ముదిరాజ్, షాద్ నగర్ మునిసిపల్ అధ్యక్షులు ఉప్పరమోని రాములు, జిల్లా నాయకులు గుళ్ళు శ్రీనివాస్, ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు ఆవ జగన్, కొందుర్గు మండల దర్గ వెంకటేష్, చౌదరిగూడ మండల అధ్యక్షులు డి రాములు, చేవెళ్ల మండల అధ్యక్షులు అశోక్, , గోపాల్, హరిప్రసాద్, గుండ్ల నవీన్, గుంటి శంకర్, జోసెఫ్, రవి కుమార్, యాదయ్య, వడ్డే శంకర్, గడీల అంజయ్య, శ్రీశైలం, ఎల్ల రాజు, యాదగిరి లు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: