బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

Homeతెలంగాణ

ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు నమస్తే భారత్ :-పెద్దవంగర మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని ఉప్పరగూడె

మాజీ కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కుటుంబానికి పరామర్శించిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్
*ఎస్‌జీఎఫ్‌ వాలీబాల్‌లో ఇండియన్‌ హైట్స్‌ విద్యార్థుల సత్తా*
*రాజీనామా చేయాలి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే*

ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

నమస్తే భారత్ :-పెద్దవంగర

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న హైస్కూల్, అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేస్తూ సంబరాలను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు చిన్నారుల్లో పండుగల పట్ల ఆసక్తిని పెంపొందించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆయా సిబ్బందితో పాటు కన్నా శ్రీనివాస్, రమేష్, రేణుక, సులోచన, అశ్విని, సుకన్య, అచ్యుత్, మానస్వి, మనువర్షిణి, ఉమేష్, పరమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: