బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఘనంగా కామ్రేడ్ యామిని పుల్లయ్య 4వ వర్ధంతి

Homeతెలంగాణ

ఘనంగా కామ్రేడ్ యామిని పుల్లయ్య 4వ వర్ధంతి

ఘనంగా కామ్రేడ్ యామిని పుల్లయ్య 4వ వర్ధంతి సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గు

జర్నలిస్ట్ దేవేందర్ నాయక్ తండ్రిని పరామర్శించిన టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు. సిహెచ్. శ్రీనివాస్
దేశ్యా తండాలో వివాహ రిసెప్షన్‌కు హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
మరిపెడ లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

ఘనంగా కామ్రేడ్ యామిని పుల్లయ్య 4వ వర్ధంతి

సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ యామిని పుల్లయ్య గారి నాలుగో వర్ధంతి ఆయన స్థూపం దగ్గర కామ్రేడ్ Sk షరీఫ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, పుల్లయ్య గారు, చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతున్న, ఆయన సేవలు గ్రామ మండల పార్టీలో ఎంతో స్ఫూర్తినిచ్చాయని తెలియజేశారు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడిగా, గుండెపుడి పార్టీ శాఖ కార్యదర్శిగా అనేక అనేక పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు, రైతులకి కనీసం మద్దతు ధర కల్పించాలని, విపరీతంగా పెరిగిన ఎరువులు,పురుగు మందుల ధరలు తగ్గించాలని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఇలాంటి నాయకుడు స్ఫూర్తితో నేటి భావిభారత విద్యార్థిని విద్యార్థులు యువకులు పుల్లయ్య గారి స్ఫూర్తితో ముందుకు వచ్చి సమాజం కోసం పనిచేయాలని మధు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శాఖ సెక్రెటరీ, Sk షరీఫ్, రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు అల్లి శ్రీనివాస్ రెడ్డి, గొర్రెల మేకల సంగం గ్రామ బాధ్యులు బింగి మహేష్, మారబోయిన లింగయ్య, గుండ గాని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: