బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*షాద్‌నగర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ చెస్ చాంపియన్‌షిప్*

Homeతెలంగాణ

*షాద్‌నగర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ చెస్ చాంపియన్‌షిప్*

*షాద్‌నగర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ చెస్ చాంపియన్‌షిప్* *చదరంగంతో మేధో వికాసం.. సీఐ సీతారాం ప్రత్యేక సందేశం* *గణేష్ ఉత్సవ చెస్ చాం

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
*మాల విద్యార్థి గర్జనను విజయవంతం చేయాలి*
పెరుగుతున్న ధరలు.. కుంగుతున్న పేదల బతుకులు – నిత్యావసర ధరలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి! సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్.

*షాద్‌నగర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ చెస్ చాంపియన్‌షిప్*

*చదరంగంతో మేధో వికాసం.. సీఐ సీతారాం ప్రత్యేక సందేశం*

*గణేష్ ఉత్సవ చెస్ చాంపియన్‌షిప్‌కు విశేష స్పందన*

*చెస్‌తో ఆలోచన శక్తి పదును.. సీఐ సీతారాం*

నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్27: చదరంగం ఆడటం వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి, ఏకాగ్రత, మేధో వికాసం పెరుగుతాయని షాద్‌నగర్ పట్టణ సీఐ సీతారాం అన్నారు. ఆదివారం పట్టణంలోని పతంజలి యోగ సెంటర్‌లో షాద్‌నగర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో తొలిసారి గణేష్ ఉత్సవ చెస్ చాంపియన్‌షిప్ నిర్వహించారు. చెస్ మాస్టర్ వారణాసి జగన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు సీఐ సీతారాం ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.అండర్‌-8 విభాగంలో సాయి సౌరిష్, రియాన్స్, సాయి కార్తీక్‌రెడ్డి; అండర్‌-10లో శ్రీమాన్‌రెడ్డి, ఆయుష్, సిద్ధార్థ్ లక్ష్మణ్; అండర్‌-12లో శ్రీ హర్షిత్, వేదాదిత్య, నిహాల్‌రెడ్డి; అండర్‌-14లో భానుతేజ, సాత్విక్, శ్రీకర్; అండర్‌-16లో అద్వైత్, సాత్విక్, గౌతమ్ బహుమతులు అందుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చెస్ కేవలం వినోదం కోసం ఆడే ఆట కాదని, ప్రతి ఎత్తును ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా విద్యార్థుల్లో మేధో సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. చిన్న వయస్సు నుంచే చెస్‌పై ఆసక్తి పెంచుకుంటే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మేధో క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్ మణికంట,సర్పంచులు కృష్ణవేణి హరినాయక్, బాబు నాయక్, శ్రీకాంత్ యాదవ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: