బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సీతారాంపురంలో ఘనంగా గణపయ్య లడ్డూ వేలం పాటలో రూ.35,216లకు లడ్డూను దక్కించుకున్న  అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులు

Homeతెలంగాణ.

సీతారాంపురంలో ఘనంగా గణపయ్య లడ్డూ వేలం పాటలో రూ.35,216లకు లడ్డూను దక్కించుకున్న అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులు

సీతారాంపురంలో ఘనంగా గణపయ్య లడ్డూ వేలం పాటలో రూ.35,216లకు లడ్డూను దక్కించుకున్న అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబ

*ది ప్యారడైజ్ మూవీలో రాక్ డాన్స్ అకాడమీ విద్యార్థుల స్టెప్పులు*
జంగాలపల్లిలో వినాయక చవితి వేడుకలు:ఆరెళ్ల కుమార్ – లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం
అందరికి నమస్కారం ముఖ్య గమనిక:

సీతారాంపురంలో ఘనంగా గణపయ్య లడ్డూ వేలం పాటలో రూ.35,216లకు లడ్డూను దక్కించుకున్న

అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మూడవ వార్డు సీతారాంపురం కాలనీలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణపయ్య లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న శ్రీ గణపయ్య లడ్డూను వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని పోటీగా వేలం వేశారు.
ఈ వేలం పాటలో మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులు రూ.35,216లకు గణపయ్య లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం లడ్డూను దక్కించుకున్న అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులను వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలకు భక్తులు, కాలనీ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. వేలం పాట కార్యక్రమంలో కాలనీ ప్రజలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: