వినాయక స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జి. విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు నమస్తే భారత్ షాద్ నగర్,కొందుర్గు, సెప్టెంబర్ 23: శ్రీ వినాయక స్వామి
వినాయక స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జి. విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు
నమస్తే భారత్ షాద్ నగర్,కొందుర్గు, సెప్టెంబర్ 23:
శ్రీ వినాయక స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి, బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకులు జి. విజయ్ కుమార్ గారు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన భజన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.ఈ పూజా కార్యక్రమంలో గండేటి జంగయ్య గారు, శంకరమ్మ గారు, జి. విజయ్ కుమార్ గారు, శ్వేత, సాధ్విత, వినయ్ కుమార్, నీరజ, రుద్రాంశ్, రాధాకృష్ణ గారు తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అలాగే గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమం అనంతరం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
శ్రీ వినాయక స్వామి వారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని జి. విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.

COMMENTS