వేం అన్న ఫోటో తో వందమంది ఆడబిడ్డలకుమంగళహారతులుసమ్మయ్య గౌడ్ కానుక రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన వందమంది ఆ
వేం అన్న ఫోటో తో వందమంది ఆడబిడ్డలకుమంగళహారతులుసమ్మయ్య గౌడ్ కానుక



రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన
వందమంది ఆడబిడ్డలకు మంగళహారతుల ప్లేట్లు బహూకరించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
యువత ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అభినందనీయమన్న సమ్మయ్య గౌడ్
నమస్తే భారత్ :-కేసముద్రం
రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. కుంకుమార్చనలో పాల్గొన్న వందమంది ఆడబిడ్డలకు వేం అన్న చిత్రంతో కూడిన మంగళహారతుల ప్లేట్లను కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆత్మీయంగా బహూకరించారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలను పలకరిస్తూ మంగళహారతుల ప్లేట్లను అందజేశారు.గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, పిల్లలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సమ్మయ్య గౌడ్ ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించిన రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. యువత ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో ముందుండటం ద్వారా గ్రామంలో ఐక్యత, సేవాభావం మరింత పెంపొందుతుందని అన్నారు.
కార్యక్రమంలో రాక్ స్టార్ యూత్ ప్రెసిడెంట్ సింగని ప్రశాంత్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కామగాని సరయ్య, ఉపసర్పంచ్ కంచ శ్రీను, మాజీ సర్పంచ్ గంధసిరి వెంకన్న, వార్డు సభ్యులు సింగని ప్రభాకర్, గంధసిరి సంతోష్, గుండెబోయిన సుధాకర్, నాయకులు సింగని వెంకటేష్, మహేష్, చాంద్ పాషా, అమీర్, శ్రీనాథ్, గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS