బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రజల ఆరోగ్యం కోసం పరిశుభ్రత.. సమస్యల పరిష్కారం కోసం నిరంతర సేవ!

Homeతెలంగాణ

ప్రజల ఆరోగ్యం కోసం పరిశుభ్రత.. సమస్యల పరిష్కారం కోసం నిరంతర సేవ!

ప్రజల ఆరోగ్యం కోసం పరిశుభ్రత.. సమస్యల పరిష్కారం కోసం నిరంతర సేవ! కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను నమస్తే భారత్ :-మరిపెడ మహబ

బీజేపీ విధానాలకు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలి
వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న
*మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారు*

ప్రజల ఆరోగ్యం కోసం పరిశుభ్రత.. సమస్యల పరిష్కారం కోసం నిరంతర సేవ!

కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర థియేటర్ బజారులో గల రాజేష్ టైలర్స్ సమీపంలోని గల్లీలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురికి కారణంగా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది.
మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను చొరవతో, శానిటేషన్ ఆఫీసర్ యాకోబ్ పాషా పర్యవేక్షణలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో గల్లీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పూర్తిస్థాయిలో తొలగించి శుభ్రం చేయించారు.
ప్రజలు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతో వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: