జెడ్పీటీసీ గొల్లమందల సంకీర్తనకు ఘన సత్కారం శ్రీనివాసపురంలో మర్యాదపూర్వక భేటీ. శ్శాలువతో సత్కరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్
జెడ్పీటీసీ గొల్లమందల సంకీర్తనకు ఘన సత్కారం
శ్రీనివాసపురంలో మర్యాదపూర్వక భేటీ. శ్శాలువతో సత్కరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు
జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 11( ప్రేమ్ కిరణ్)
జంగారెడ్డిగూడెం మండల జెడ్పీటీసీగా ఎన్నికైన గొల్లమందల సంకీర్తనను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుధవారం శ్రీనివాసపురంలో జరిగిన మర్యాదపూర్వక భేటీలో ఆమెకు శ్శాలువ కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ, జెడ్పీటీసీగా ఎన్నికైన గొల్లమందల సంకీర్తనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గొల్లమందల సంకీర్తనకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కుక్కల మాధవరావు, గొల్లమందల శ్రీనివాస్, యెలికే ప్రసాద్, రాగాని శ్రీనివాస్, శీలం వెంకటరాజు, కృష్ణరాజు, పొల్నాటి పెంటరావు, రవి, పిప్పర లక్ష్మణరావు, పెంటు సాహెబ్, తానిగడప రామకృష్ణ, ప్రకాష్, తాళ్లూరి రామకృష్ణ, చాటపర్తి బాలాజీ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు

COMMENTS