బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తమ్మిడిపొంట ప్రాజెక్టుతో రైతులకు ఒరిగేదేమిటి?

Homeతెలంగాణ

తమ్మిడిపొంట ప్రాజెక్టుతో రైతులకు ఒరిగేదేమిటి?

తమ్మిడిపొంట ప్రాజెక్టుతో రైతులకు ఒరిగేదేమిటి? సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన లతా ప్రేమ్‌గౌడ్ బండ్లగూడ జాగీర్ బిఆర్ఎస్ నాయకులు నమస్తే భరత్ గండి

వినాయక స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జి. విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు
ఇందిరా నగర్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
దోపిడీ లేని సమాజం కోసం పోరాడాలి

తమ్మిడిపొంట ప్రాజెక్టుతో రైతులకు ఒరిగేదేమిటి?

సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన లతా ప్రేమ్‌గౌడ్ బండ్లగూడ జాగీర్ బిఆర్ఎస్ నాయకులు

నమస్తే భరత్ గండిపేట్ మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: తమ్మిడిపొంట ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని బండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ లతా ప్రేమ్‌గౌడ్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి తన అధికారిక పోస్టులో “చెరువు బతకాలి.. కరువు తీరాలి” అని పేర్కొన్నారని, అయితే ఈ ప్రాజెక్టు ప్రధానంగా హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసమే అయినప్పుడు రైతులకు కరువు ఎలా తీరుతుందని ప్రశ్నించారు.
ఇప్పటికే ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో చిన్నచిన్న మరమ్మతులు, పెండింగ్ పనులు పూర్తి చేయకుండా కోట్లాది రూపాయలు కొత్త ప్రాజెక్టులపై ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ వీడియోల్లో నీరు మురికిగా కనిపించడంపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను సమర్థంగా వినియోగించుకునేలా ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. హైదరాబాద్‌లో విద్యుత్ సమస్యలు కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని రైతులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ప్రాజెక్టు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించి అభివృద్ధి పనులు చేపట్టాలని లతా ప్రేమ్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: