బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మైలార్‌దేవ్‌పల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల ఫౌండేషన్ పట్టాల పంపిణీ

Homeతెలంగాణ.

మైలార్‌దేవ్‌పల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల ఫౌండేషన్ పట్టాల పంపిణీ

మైలార్‌దేవ్‌పల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల ఫౌండేషన్ పట్టాల పంపిణీ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగ

మరిపెడలో నూతనంగా దొడ్ల డెయిరీ మిల్క్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి
కోరుకొండ పల్లి గ్రామంలో ఘనంగా కుంకుమార్చన పూజకార్యక్రమం
అక్రమ మద్యం విక్రయాలపై విచారణ జరపాలి దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్ చేయాలి

మైలార్‌దేవ్‌పల్లిలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల ఫౌండేషన్ పట్టాల పంపిణీ

రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందజేత

నమస్తే భారత్, రాజేంద్రనగర్, నవంబర్ 12,రాజేంద్రనగర్ నియోజకవర్గం, మైలార్‌దేవ్‌పల్లిలో పేదల సొంతింటి కలలను నిజం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీప్రకాష్ గౌడ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.మైలార్‌దేవ్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రులు, ఎమ్మెల్యే కలిసి అధికారికంగా ఫౌండేషన్ స్టోన్ వేశారు. వేడుకల అనంతరం అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు నూతన ఇందిరమ్మ ఇళ్ల పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. రాష్ట్రంలో పేదవారి సొంతింటి కల నెరవేరే రోజు ఆసన్నమైందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తై లబ్ధిదారులు త్వరలోనే సొంతింటి సౌకర్యాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: