బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

రాజేంద్రనగర్ సర్కిల్‌లో రూ. 2.37 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన

Homeతెలంగాణ

రాజేంద్రనగర్ సర్కిల్‌లో రూ. 2.37 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన

రాజేంద్రనగర్ సర్కిల్‌లో రూ. 2.37 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నమస్తే భరత్, రాజేంద్రనగర్, నవంబర్ 10, మౌలిక సౌకర

ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ*
మరిపెడ బంగ్లాలో వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని గణపతి మండపంలో లక్కీ డ్రా
International Literacy Day was celebrated at Krushi High School in Suraram Colony, Subhash Nagar Division.

రాజేంద్రనగర్ సర్కిల్‌లో రూ. 2.37 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

నమస్తే భరత్, రాజేంద్రనగర్, నవంబర్ 10, మౌలిక సౌకర్యాలు కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.. ఇందులో భాగంగా హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో సుమారు రూ. 2 కోట్ల 37 లక్షలభారీ నిధులతో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు.గోల్డెన్ హైట్స్ కాలనీరాజేంద్రనగర్ సర్కిల్, బండ్లగూడ వార్డ్ పరిధిలోని గోల్డెన్ హైట్స్ కాలనీలో నూతన వాటర్ పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.బుద్వేల డాక్టర్ గల్లీలో (రాజేంద్రనగర్ వార్డ్ & సర్కిల్) సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనుల స్థానికులు అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ పైప్‌లైన్ పనులు పూర్తైతే ఆయా ప్రాంతాల్లో తాగునీరు మురుగునీటి సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: