బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

భక్తిశ్రద్ధలతో రైతు దినోత్సవం బలరామ జయంతి జరుపుకున్న రైతులు

Homeతెలంగాణ

భక్తిశ్రద్ధలతో రైతు దినోత్సవం బలరామ జయంతి జరుపుకున్న రైతులు

భక్తిశ్రద్ధలతో రైతు దినోత్సవం బలరామ జయంతి జరుపుకున్న రైతులు నమస్తే భరత్,, 22/9/2026/ నారాయణపేట జిల్లా అప్పి రెడ్డి పల్లె గ్రామం నందు భారతీయ కిసా

ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
*దళితులు అంటే కెసిఆర్ కు ఇంత అహంకారమా*
ప్రజా సమస్యలపై స్పందించిన

భక్తిశ్రద్ధలతో రైతు దినోత్సవం బలరామ జయంతి జరుపుకున్న రైతులు

నమస్తే భరత్,, 22/9/2026/

నారాయణపేట జిల్లా అప్పి రెడ్డి పల్లె గ్రామం నందు భారతీయ కిసాన్ సంఘం జిల్లా కోశాధికారి పటేల్ రంగారెడ్డి హనుమాన్ మందిరంలో గ్రామ అధ్యక్షుడు కోస్గి రాములు సమక్షంలో రైతు దినోత్సవం జరుపుకోవడం జరిగినది బలరామ జయంతి సందర్భంగా వ్యవసాయానికి ఆది పురుషుడు బలరాముడు శ్రీకృష్ణుని అన్న వ్యవసాయంలో రోకలితో బండరాళ్ళని పలగొట్టి భూమిని దుక్కి చేసి వ్యవసాయనంకి అనుకూలంగా భూమిని చదును చేసుకొని విత్తనాలు ఎదల జల్లి బ్రహ్మాండమైన పంటలు తీయించడంలో రైతాంగానికి నేర్పరి చేయడం జరిగింది అందువల్ల ఆ యుగం నాటి నుండి ఈ యుగం వరకు వ్యవసాయదారులకు ఆదర్శప్రుచుడిగా కావడం జరిగింది పార్టీ గొప్ప సందేశాన్ని ఈరోజు వరకు భగవంతుడు ఆహారం ని పండించడంలో అద్భుత వనరులను చూపించడం జరిగింది ఇట్టి విషయాన్ని పటేల్ రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అత్యధికంగా పంటలు సాగు చేసి ప్రజలకు మంచి ఆహారం అందించి సేంద్రియ వ్యవసాయంగా మన గ్రామాన్ని ఆదర్శంగా తీర్చదిది ఆర్థికంగా ఎదగాలని ఎన్నో కొత్త వంగడాలని సృష్టించి ప్రతిరోజు ప్రతి పంట ప్రతి గ్రామం పొలాలకు వెళ్లి పంటలు పండించాలి రైతుకు ముఖ్యంగా కూరగాయలు అదనాపుగా ఆర్థికంగా ఉండేటట్లు చూసుకోవాలి ఇతర పంటల కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి కుటుంబం ప్రతిరోజు మన పొలంలో 2000 నుండి 3000 రూపాయలు సంపాదనకు మార్గం చూపించాలి అట్టి రైతు నష్టపోకుండా బలోపితం అవుతాడు సంఘటితంగా ఉండి మనం అన్ని సమస్యలనే పరిష్కరించి మనకున్న సమస్యలు ఏవైనా ఉంటే భారతీయ కిసాన్సాంగ్ ఆధ్వర్యంలో ప్రతినెల సమావేశం జరుపుకొని మన సమస్యలేని మనమే పరిష్కార మార్గంగా ప్రభుత్వం దృష్టికి పోయి పరిష్కరించాలి విద్యుత్ సమస్యలైనా గాని రెవెన్యూ సమావేశంలో గాని వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు కలిసికట్టుగా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం రైతాంగ సంఘటన శక్తిని నిరూపించుకుందాం గ్రామంలో భక్తిశ్రద్ధలతో గ్రామంలో రైతులందరూ రావడం సంతోషించదగ్గ విషయము మనస్ఫూర్తిని ఇతర గ్రామాలకు కూడా తెలియపరచి బలరాముని జయంతి ఘనంగా జరుపుకోవాలని కోరుదాం అని ఇతర పెద్దలకు రైతు దినోత్సవం సందర్భంగా చెప్పడం జరిగినది కార్యక్రమం ముగిసే ముందు బలరాముని చరిత్ర తెలిపి భజన చేయడం జరిగింది. తీర్థ ప్రసాదాలు కూడా అందరికీ పెట్టడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు నవత్ రెడ్డి,గజలప్ప, మోహన్ రెడ్డి, భరత్, చెన్నారెడ్డి, హనుమంతు, భీమప, పటేల్ నరసింహులు,శివ పూల నర్సింలు,శీలం గోవర్ధన్, దూల మొగల్ అప్ప.ఇతర రైతులు పాల్గొనడం జరిగింది

COMMENTS

WORDPRESS: 0
DISQUS: