బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

చిన్నారితో అక్షరాభ్యాసం నిర్వహించిన  అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి

Homeతెలంగాణ

చిన్నారితో అక్షరాభ్యాసం నిర్వహించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి

చిన్నారితో అక్షరాభ్యాసం నిర్వహించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి నమస్తే భారత్ :-నర్సింహులపేట మహబూబాబాద్ జిల్లా, నర్సింహులపేట మండలం.మరిపెడ ప్ర

రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్
సమ్మిగౌడ్ చేతుల మీదుగా నూతన దుకాణం ప్రారంభం
హైదరాబాద్ గోల్కొండ కోట నుండి బయలుదేరిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న

చిన్నారితో అక్షరాభ్యాసం నిర్వహించిన

అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి

నమస్తే భారత్ :-నర్సింహులపేట

మహబూబాబాద్ జిల్లా, నర్సింహులపేట మండలం.మరిపెడ ప్రాజెక్ట్ ఐసీడీఎస్ పరిధిలోని పెదనాగారం సెక్టార్ గ్యామా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి చిన్నారితో సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారికి విద్యపై ఆసక్తి పెంపొందించేలా, ప్రాథమిక విద్యకు బలమైన పునాది వేసేలా అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
అక్షరాభ్యాసం అనంతరం చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించి విద్యతో పాటు ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి సరిత పాటు అంగన్వాడి ఆయా సిబ్బంది, తల్లిదండ్రులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: