బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

భక్తి భావంతో నాగుల చవితి పూజలు

Homeతెలంగాణ

భక్తి భావంతో నాగుల చవితి పూజలు

భక్తి భావంతో నాగుల చవితి పూజలు నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నాగుల చవితి సందర్భంగా భక్తి భావం వెళ్లి విరిసింది. భక

పోలీస్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి: సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్
​గీతా విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి

భక్తి భావంతో నాగుల చవితి పూజలు

నమస్తే భారత్ :-తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నాగుల చవితి సందర్భంగా భక్తి భావం వెళ్లి విరిసింది. భక్తులు భక్తిశ్రద్ధలతో నాగుల చవితి పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి అత్యంత విశిష్టమైనదిగా పవిత్రమైనదిగా మహిళలు నమ్ముతారు ఈనాగుల చవితి సందర్భంగా ఉదయం తెల్లవారుజామునే మహిళలందరూ తలంటు స్నానం ఆచరించి పుట్ట వద్దకు వెళ్లి పుట్టలో ఆవు పాలు పోసి పసుపు కుంకుమ పుట్టపై చల్లి పూలు పెట్టి అగరువత్తులు వెలిగించి కొబ్బరి కాయలు కొట్టి నాగు పడగలు పుట్టలో వేసి మొక్కు తీర్చుకుంటారు. కోడిగుడ్డు కూడా సమర్పించి తమ మనసులో ఉన్న కోరికలు ఆ నాగదేవుడికి విన్నవించుకుంటారు. స్థానిక హరిపిరాల రోడ్డులోని కంఠమహేశ్వర స్వామి దేవాలయం దగ్గరలో ఉన్న పుట్ట దగ్గర ఉదయం నుండే వందలాది మంది మహిళలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలను అడిగినప్పుడు ఈరోజు ఇలాంటి పూజలు నిర్వహించడం వల్ల శివుడి మెడలో ఉండే ఆ నాగదేవత అనుగ్రహం కలిగి కుటుంబాలలో ఆరోగ్యంతో పాటు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయని తమ నమ్మకం అని చెప్పడం జరిగింది ఈ పూజలలో అధిక సంఖ్యలో మహిళలు అదేవిధంగా కొంతమంది కుటుంబ సమేతంగా పాల్గొన్నారు నాగదేవత అనుగ్రహంతో అంతా మంచే జరగాలని ఆశించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: