బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్.పి.వి వ్యాక్సిన్ అవగాహన మరియు టీకా కార్యక్రమం

Homeతెలంగాణ

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్.పి.వి వ్యాక్సిన్ అవగాహన మరియు టీకా కార్యక్రమం

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్.పి.వి వ్యాక్సిన్ అవగాహన మరియు టీకా కార్యక్రమం నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమ

రాజేంద్రనగర్ సర్కిల్‌లో రూ. 2.37 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన
మామునూరు విమానాశ్రయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్.పి.వి వ్యాక్సిన్ అవగాహన మరియు టీకా కార్యక్రమం

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో, స్థానిక సెయింట్ అగస్టిన్ పాఠశాలలో గురువారం నాడు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వూకల్ కాన్సర్ ) నివారణ కోసం హెచ్.పి.వి.వ్యాక్సిన్‌పై ప్రత్యేక అవగాహన మరియు టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ, మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ముందుజాగ్రత్తగా ఈ హెచ్.పి.వి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ వ్యాక్సిన్ ఆవశ్యకతపై అవగాహన కల్పించి, అనంతరం పాఠశాలకు చెందిన 20 మంది బాలికలకు టీకాలు వేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ లీట్టి జోష్, హెల్త్ సూపర్‌వైజర్ లక్ష్మీ కుమారి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, ఏఎన్ఎంలు శ్రీదేవి, హరీష మరియు ఆశా కార్యకర్తలు.తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: