బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

చింతలపూడిలో ఎక్సైజ్ అధికారుల జాయింట్ దాడులు

Homeతెలంగాణ

చింతలపూడిలో ఎక్సైజ్ అధికారుల జాయింట్ దాడులు

చింతలపూడిలో ఎక్సైజ్ అధికారుల జాయింట్ దాడులు నాటుసారా తయారీకి ఉపయోగించే 50 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. బెల్ట్‌షాపుపై కేసు నమోదు చింతలపూడి నమస్తే భార

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెరిగిన పింఛన్లు అందించాలి –
మానవాళి మనుగడకు మొక్కలే ప్రాణాధారం ప్రిన్సిపాల్ డాక్టర్ రౌత్ అజయ్ కుమార్
గిరిజన అడవి బిడ్డని ఆహ్వానించిన స్పెయిన్

చింతలపూడిలో ఎక్సైజ్ అధికారుల జాయింట్ దాడులు

నాటుసారా తయారీకి ఉపయోగించే 50 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. బెల్ట్‌షాపుపై కేసు నమోదు

చింతలపూడి నమస్తే భారత్ నవంబరు 11( ప్రేమ్ కిరణ్)

ఎక్సైజ్ నేరాల నియంత్రణలో భాగంగా ఏలూరు జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలో ఎక్సైజ్ అధికారులు జాయింట్ రైడ్స్ నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే 50 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు, బెల్ట్‌షాపుపై కేసు నమోదు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కె.వి.ఎన్. ప్రభుకుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఏ. ఆవులయ్య ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ భోగేశ్వరరావు, ఈఎస్‌టీఎఫ్ ఎస్‌ఐ ఎం.డి. ఆరిఫ్, చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది సంయుక్తంగా ఈ దాడులు చేపట్టారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన జరబల రాము నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 50 లీటర్ల పులిసిన బెల్లం ఊటను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. నిందితుడు అందుబాటులో లేకపోవడంతో అతనిపై పరారీ కేసు నమోదు చేశారు. అలాగే యర్రగుంటపల్లి గ్రామంలో బెల్ట్‌షాపులపై దాడులు నిర్వహించి, పోతురాజు శారద అనే మహిళ వద్ద నుంచి 9 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను చింతలపూడి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, 129 బి.ఎన్.ఎస్.ఎస్. చట్టం ప్రకారం బైండోవర్ బాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, చింతలపూడి మండలంలోని పలు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం నిల్వలను పరిశీలించడంతో పాటు, ఏపీఎస్‌బీసీఎల్ ఎక్సైజ్ డిపో నుంచి సరఫరా అయిన మద్యం సీసాలపై ఉన్న హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్‌లను తనిఖీ చేశారు. ఏపీ సురక్ష ఆన్‌లైన్ యాప్ ద్వారా కూడా మద్యం సీసాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మద్యం దుకాణాల సేల్స్ సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌ఐలు అబ్దుల్ ఖలీల్, జె. జగ్గారావు, ట్రైనీ ఎస్‌ ఐ బి. ధనలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ వివరాలను ఎక్సైజ్ సీఐ పి. అశోక్ వెల్లడించారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0