బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

వార్డ్ మెంబర్లు ఏకం కావాలి – మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం

Homeతెలంగాణ

వార్డ్ మెంబర్లు ఏకం కావాలి – మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం

*వార్డ్ మెంబర్లు ఏకం కావాలి – మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం* *వేతనం కల్పించాలి – అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వార్డ్ మెంబర్ల పేర్లు తప్పనిసరిగా ఉ

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
వాసవి అర్బన్‌లో ఫ్లాట్ల అప్పగింత జాప్యంపై భగ్గుమన్న యజమానులు.. రోడ్డుపై బైఠాయింపు
వినాయక చవితి సందర్భంగా 3వ వార్డులో ఘనంగా అన్నదానం కార్యక్రమం

*వార్డ్ మెంబర్లు ఏకం కావాలి – మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం*

*వేతనం కల్పించాలి – అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వార్డ్ మెంబర్ల పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందే*

*ప్రత్యేక వార్డ్ మెంబర్ భీమా, హెల్త్ కార్డ్ ప్రభుత్వం ఇవ్వాల్సిందే*

*ఫరూక్ నగర్ మండల స్థాయి వార్డు మెంబర్ల సభలో వార్డ్ మెంబర్ తుప్పరి వనజాకుమార్*

నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్10: నియోజకవర్గంలో ఫరూక్ నగర్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు రాజకీయాలకు అతీతంగా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశానుసారం మన వార్డ్ మెంబర్లు అందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ సభకు రంగారెడ్డి జిల్లా ఇంచార్జి గ్యార సురేష్ గారు, కో ఇంచార్జి మల్లేష్ గారు మరియు షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ , వివిధ మండలాల అధ్యక్షులు, ఫరూక్ నగర్ మండల పదాధికారులు అదే విధంగా వెల్ జర్ల గ్రామ వార్డ్ సబ్యులు వెంకటయ్య నాయక్, ఆచారి అనిత, రవీందర్ లక్ష్మీ, చందు నాయక్, రమేష్, పవన్, లావణ్య దేవేందర్ పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వార్డ్ మెంబర్ తుప్పరి వనజ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్డు మెంబర్ల పాత్ర ఎంతో కీలకమైనదని, గ్రామంలోని ప్రతి వీధి సమస్యను, ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముందుగా గుర్తించి ప్రజల తరఫున అధికారుల దృష్టికి తీసుకెళ్లేది వార్డు మెంబర్లేనని అన్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన వార్డు మెంబర్లు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి తగిన గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత లభించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైన్లు, వీధి దీపాలు, విద్య వసతులు, వైద్య వసతులు, యువత భవిష్యత్తు కోసం మరియు తదితర అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో సంబంధిత వార్డు మెంబర్ల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు సంబంధిత వార్డు మెంబర్ పేరు కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా పొందుపరచాలని కోరారు.అలాగే ప్రజాసేవ కోసం నిరంతరం పనిచేస్తున్న వార్డు మెంబర్లకు గౌరవ వేతనం కల్పించాలని, తగిన ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత కార్డ్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వార్డు మెంబర్లకు తగిన గుర్తింపు, గౌరవం, అధికారిక ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
వార్డు మెంబర్లు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం పక్కనపెట్టి, తమ హక్కుల సాధన కోసం ఒకే వేదికపైకి రావాలని సూచించారు. మన ఐక్యతే మన బలం, మన పోరాటమే మన హక్కుల సాధనకు మార్గమని పేర్కొన్నారు.వార్డు మెంబర్ల గౌరవం అనేది వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు.. అది గ్రామీణ ప్రజాస్వామ్యానికి ఇచ్చే గౌరవం.ఈ హక్కుల సాధన ఉద్యమంలో ప్రతి వార్డు మెంబర్ భాగస్వామి కావాలని, ఐక్యంగా ముందుకు సాగాలని వార్డ్ మెంబర్ తుప్పరి వనజాకుమార్ పిలుపునిచ్చారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: