బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్.

Homeతెలంగాణ

మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్.

మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ - కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్. ప్రతీ గ్రామం లో, ఇందిరమ్మ ఇంట్లో ఇంట్లో సీఎం రేవంతన్న పుట్టినరోజ

బజరంగ్‌దళ్ ప్రముఖ్ జి. కుమారస్వామి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత
నర్వ మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం మరియు మన ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు జరిపిన బీజేపీ నాయకులు. బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి
*సిద్ధాపూర్ డంపింగ్ యార్డు పిర్యాదుతో కదిలిన జాతీయ ఎస్టీ కమిషన్*

మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్.

ప్రతీ గ్రామం లో, ఇందిరమ్మ ఇంట్లో ఇంట్లో సీఎం రేవంతన్న పుట్టినరోజు వేడుకలు.._

ఎమ్మెల్యే మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్ ఆదేశాలతో-పట్టువస్త్రాల బహుకరణ-అధ్యక్షులు సమ్మిగౌడ్

ముఖ్య అతిధిగా పాల్గొన్న – మండల పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

తాళ్లపూసపల్లి,ధర్మారం తండ జీపీ, కల్వల, భూక్యారాం తండ జీపీ, తిమ్మపేట, కాట్రపల్లి సహా పలు గ్రామాల్లో పండుగ సంబరాల్లో పాల్గొన్న -మండల పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్_ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో దీపావళి పండుగ వేళ ఆనందాన్ని నింపేలా కేసముద్రం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళీ నాయక్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ స్థానిక సర్పంచ్ లు, గ్రామాపార్టీ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ మెంబెర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంద సంఘాల నాయకుల కోరిక మేరకు వారితో కలిసి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో తాళ్లపూసపల్లి గ్రామం ,ధర్మారం తండ జీపీ, కల్వల గ్రామం, భూక్యారాం తండ జీపీ, తిమ్మంపేట గ్రామం, కాట్రపల్లి గ్రామం సహా పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో కలిసి మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ కార్యక్రమాన్ని రంగ రంగ వైభవంగా నిర్వహించారు.స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఆదేశాల మేరకు ఇందిరమ్మ లబ్దిదారుల దంపతులకు నూతన పట్టువస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని.పురస్కరించుకొని మాకు గూడు కల్పించిన ముఖ్యమంత్రి రేవంతన్న జన్మదినo మా ఇంట్లోనే జరుపుకుంటామని ప్రతీ లబ్దిదారు వారి ఇంట్లో కుటుంబసభ్యులతో పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకుల తో కలిసి సీఎం రేవంతన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేసముద్రం మండలం లోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ మండల పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు గ్రామ పార్టీ, సర్పంచ్ లు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున కేక్ కట్ చేసి, బాణాసంచా కాలిసి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా సొంత ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, పేద కుటుంబానికి ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తుపై భరోసా కల్పించే చిరునామా అని అన్నారు. దీపావళి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతోనూ పండుగ సంతోషాన్ని పంచుకోవాలనే ఆత్మీయ ఉద్దేశంతో పట్టు వస్త్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్ సూచనలతో ప్రజలకు మరింత చేరువగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ప్రజల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాట్లాడుతూ గత పదేళ్లుగా ఉండడానికి గూడు లేక పాములతో,తేళ్ల భారిన పడి ఎక్కడ ఎంవుతావేమో అనే భయం తో,ఎండకు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ రాత్రింబవళ్లు నరకయాతన చూసిన మాకు గత ఎలక్షన్స్ లో రేవంత రెడ్డి కాంగ్రెస్.ప్రభుత్వం,శాసనసభ్యులు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి మేము సమాజం లో గౌరవంగా బ్రతికేలా చేశారని,ఇందిరమ్మ ఇంట్లో ఈ రోజు దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం జేశారు.ఈ కార్యక్రమాల్లో పీసీసీ సభ్యులు దస్రు నాయక్.గ్రామాల సర్పంచులు ఏదరబోయిన సూరయ్య,నంద్యా నాయక్, సంతోష్ నాయక్,శంకర్ నాయక్,కట్ల ఎల్లయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య,జల్లె యాకంభ్రం,మిట్టగడుపుల యాకుబ్, గుగులోత్ రాము, నంద్యా,ఇందిరమ్మ కమిటీ సభ్యులు సిలివేరు లింగయ్య, పోలు నాగయ్య, ఈర్జాల మల్లికాంబ, కునుసోత్ బాలకిషన్, వాంకుడోత్ గంగ, కునుసోత్ సుమిత్ర, బానోత్ శంకర్, బోడ రమేష్ పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ముంజల శ్రీనివాస్, పెరుమాండ్ల సోమయ్య, పోలు శ్రీనివాస్, గుండెపురి వెంకన్న, తొగరి తిరుపతి, ఏశబోయిన సంపత్, దేశభయిన అనిల్, తొగరి బిక్షపతి, ఇసంపల్లి యుగేందర్, కురిమిళ్ల భార్గవ్,గ్రామ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: