బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*ప్రకృతి వైపరీత్యాలకు ఆందోళన చెందుతున్న అన్నదాతలు…*

Homeతెలంగాణ.

*ప్రకృతి వైపరీత్యాలకు ఆందోళన చెందుతున్న అన్నదాతలు…*

*ప్రకృతి వైపరీత్యాలకు ఆందోళన చెందుతున్న అన్నదాతలు...* నమస్తే భారత్: మురసు తుఫాను కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పరిధిలోని పలు

ఫీజు బకాయి బిజెపి లడాయి నిరాహార దీక్షలో పాల్గొన్న మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ మెదక్,
దారం శ్రీనుకు పట్టణ ప్రముఖుల పరామర్శ
భగత్ సింగ్ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలి

*ప్రకృతి వైపరీత్యాలకు ఆందోళన చెందుతున్న అన్నదాతలు…*

నమస్తే భారత్:
మురసు తుఫాను కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో వరి, మిరప, మునగ తోటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు అన్నారు. మండలంలోని నరసింహాపురం గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను గురువారం నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో పత్తి దిగుబడి రాలేదని, మిరప తోటలు కూడా ఆశాజనకంగా లేవని తెలిపారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన వరి పంట చివరి నిమిషంలో మురసు తుఫాను కారణంగా నీట మునిగి, నేలకొరగడంతో తీవ్రంగా నష్టపోయారని” ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి చేతికి వచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టంపై ఫీల్డ్ సర్వే నిర్వహించి, పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని డిమాండ్ చేశారు. తుఫాను ధాటికి నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం తగిన పంట నష్టపరిహారం అందించి తక్షణమే ఆదుకోవాలని వారు కోరారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: