తుగ్గలి, మామిళ్లకుంట గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఆదరాభిమానాలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మాదిరెడ్డ
తుగ్గలి, మామిళ్లకుంట గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు
మీ ఆదరాభిమానాలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మాదిరెడ్డి వింధ్య వాసిని
తుగ్గలి, నవంబర్ 5 (నమస్తే భారత్):-తుగ్గలి, మామిళ్లకుంట గ్రామాల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సోదరభావంతో విజయవంతంగా ముగియడం సంతోషకరమైన విషయమని తుగ్గలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి మాదిరెడ్డి వింధ్య వాసిని తెలిపారు.
ఈ ఎన్నికల సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన తుగ్గలి, మామిళ్లకుంట గ్రామాల ప్రజలకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించిన పోలీస్ శాఖ సిబ్బందికి, రెవెన్యూ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా తనకు అండగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు మరియు రెండు గ్రామాల ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రజలు చూపిన ఆదరాభిమానాలు, ప్రేమ తనకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని, ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మాదిరెడ్డి వింధ్య వాసిని పేర్కొన్నారు.

COMMENTS