బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం

Homeతెలంగాణ.

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం కొండసముద్రం బతుకమ్మ ఘాట్‌ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి సిపిఐ జిల్లా సమితి సభ్యు

స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు జశ్వంత్ ఎంపిక మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యార్థికి అరుదైన అవకాశం
ఘనంగా బలరామ జయంతి
నెల రోజులుగా వెలగని వీధి దీపాల.భయాందోళనలో కాలనీవాసులు!

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం

కొండసముద్రం బతుకమ్మ ఘాట్‌ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి

సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

నమస్తే భారత్ :-మరిపెడ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు.భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాలతో నిర్వహిస్తారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ అన్నారు.
మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలోని కొండసముద్రం బతుకమ్మ ఘాట్ వద్ద ఇప్పటికే బతుకమ్మ నిమజ్జనానికి మెట్లు ఉన్నప్పటికీ, ఘాట్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతం తగిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సమయంలో మహిళలు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
బతుకమ్మ పండుగ సమయంలో కేవలం నామమాత్రపు ఏర్పాట్లు చేయకుండా, కొండసముద్రం బతుకమ్మ ఘాట్ పరిసరాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఘాట్ పరిసరాల్లో పరిశుభ్రత, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, తాగునీటి సౌకర్యం, చెత్త నిర్వహణ, పచ్చదనం, మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.కొండసముద్రం ప్రాంతాన్ని కేవలం బతుకమ్మ పండుగ సమయంలో మాత్రమే ఉపయోగించే ప్రదేశంగా కాకుండా, మరిపెడ బంగ్లా మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే విధంగా శాశ్వత బతుకమ్మ ఘాట్‌గా, సుందరమైన సాంస్కృతిక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని అన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే బతుకమ్మ పండుగ పవిత్రతను కాపాడే విధంగా ఘాట్ పరిసరాలను అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దాలని కోరారు. ఇందుకోసం అవసరమైన నిధులు కేటాయించి శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో మరిపెడ బంగ్లా టౌన్ కార్యదర్శి పగిళ్ల అంజి, సహాయ కార్యదర్శి రాసాల యుగంధర్, పానుబోతు ఎంకన్న, అక్కెనపల్లి రాములు, లింగయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0