బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన  ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

Homeతెలంగాణ

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్ల

*సిద్ధాపూర్ డంపింగ్ యార్డు పిర్యాదుతో కదిలిన జాతీయ ఎస్టీ కమిషన్*
అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ : ఎంపీ
సీఎం వ్యాఖ్యలకు నిరసన

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన

ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన ఆర్కావత్ సీత ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, సీత మృతికి సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు, టౌన్ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్, కౌన్సిలర్లు జాటోతు సురేష్, జియో రమేష్, గంట్ల గౌతమ్ రెడ్డి, గుండగాని వేణు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: