బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలి  ఎంపిడివో అద్వైత

Homeతెలంగాణ

నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలి ఎంపిడివో అద్వైత

నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలి ఎంపిడివో అద్వైత   ఖానాపురం అక్టోబర్ 6(మల్లేష్ ,నమస్తే భారత్ ) : అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుం

ప్రముఖ గార్మెంట్ మల్టీనేషనల్ కంపెనీని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసులో దాదాపు
వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.డీఎస్ రెడ్యా నాయక్
ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలి

ఎంపిడివో అద్వైత

 

ఖానాపురం అక్టోబర్ 6(మల్లేష్ ,నమస్తే భారత్ ) :

అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని ఎంపిడివో అద్వైత అన్నారు.ఖానాపురం మండలంలోని బుధరావుపేట ప్రాథమిక పాఠశాలను అధికారులు సందర్శించారు.అక్కడ జరుగుతున్న అంగన్‌వాడీ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శి బాలును ఎంపిడివో ఆదేశించారు.
అనంతరం రాగంపేట, రంగాపురం గ్రామపంచాయతీలను సందర్శించిన అధికారులు వీవో భవనాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే వీవో భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పీర్ ఏఈ ఉదయ్‌తో అధికారులు చర్చించారు. ఈకార్యక్రమంలో పీఆర్ ఏఈ ఉదయ్, పంచాయతీ కార్యదర్శి బాలు, రాగంపేట సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి అబేదా తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: