బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మాకుల చెరువు వద్ద గణేష్ నిమజ్జనంలో వైద్య శిబిరం ఏర్పాటు: వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి

Homeతెలంగాణ

మాకుల చెరువు వద్ద గణేష్ నిమజ్జనంలో వైద్య శిబిరం ఏర్పాటు: వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి

మాకుల చెరువు వద్ద గణేష్ నిమజ్జనంలో వైద్య శిబిరం ఏర్పాటు: వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్

గణపతి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన అభివృద్ధి
దోపిడీ లేని సమాజం కోసం పోరాడాలి
మహిళలకు ఉపాధి అవకాశం.. అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం!

మాకుల చెరువు వద్ద గణేష్ నిమజ్జనంలో వైద్య శిబిరం ఏర్పాటు:
వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల చెరువు వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి తెలిపారు.బుధవారం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనానికి వచ్చే భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణమే వైద్య సేవలు అందించడానికి ఈ శిబిరాన్ని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. శిబిరంలో అవసరమైన అత్యవసర మందులు, ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచామన్నారు.
ఈ వైద్య శిబిరంలో డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్, ఎం.ఎల్.హెచ్.పి (MLHP) సతీష్, హెల్త్ అసిస్టెంట్ వీరన్నతో పాటు ఏఎన్ఎంలు (ANMs), ఆశా ఆరోగ్య కార్యకర్తలు పాల్గొని ప్రజలకు వైద్య సేవలకు అందుబాటులో ఉంటారు. నిమజ్జన ప్రాంతంలో ప్రజలు, భక్తులు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి కోరారు.అదేవిధంగా 108 వాహనం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: