బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

షాద్ నగర్ ప్రభుత్వ కుంట హై స్కూల్ విద్యార్థినుల కు హెచ్ పి వి వ్యాక్సినేషన్ అవగాహన

Homeతెలంగాణ

షాద్ నగర్ ప్రభుత్వ కుంట హై స్కూల్ విద్యార్థినుల కు హెచ్ పి వి వ్యాక్సినేషన్ అవగాహన

షాద్ నగర్ ప్రభుత్వ కుంట హై స్కూల్ విద్యార్థినుల కు హెచ్ పి వి వ్యాక్సినేషన్ అవగాహన డాక్టర్ దినేష్ ఎం ఎల్ హెచ్ పి వైద్య అధికారి జెశ్రీనివాసులుహె

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి*
కొందుర్గు ఎస్సై వరప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిచిన సిపిఐ ప్రజాసంఘాల నాయకులు
*రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు*

షాద్ నగర్ ప్రభుత్వ కుంట హై స్కూల్ విద్యార్థినుల కు హెచ్ పి వి వ్యాక్సినేషన్ అవగాహన

డాక్టర్ దినేష్ ఎం ఎల్ హెచ్ పి వైద్య అధికారి జెశ్రీనివాసులుహెల్త్ ఎడ్యుకేటర్

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్23: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఏరియా లోని సబ్ సెంటర్ ” డి” షాద్నగర్, ప్రభుత్వ కుంట హై స్కూల్ లో విద్యార్థినులకు ఎమ్. ఎల్ . హెచ్ పి. డాక్టర్ దినేష్ గారి ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమము నిర్వహించారు. హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు విద్యార్థినిలతో మాట్లాడుతూ హెచ్ పి వి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అని, ఇది మిగతా వైరస్ల మాదిరిగానే, చాలా సాధారణమైన వైరస్ అని, హెచ్ పి వి లో అనేక రకాల వైరస్ లు ఉన్నాయి అని, వాటిలో కొన్ని రకాలు భవిష్యత్తులో విద్యార్థినులకు మరియు స్త్రీలకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ తో పాటు, కొన్ని ఇతర క్యాన్సర్లకు కారణం అవుతాయని తెలియజేశారు. హెచ్ పి.వి వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి అంటే..? హెచ్పీవీ వ్యాక్సిన్ ఒక నివారణ టీకా, అంటే క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడానికి కాకుండా, హెచ్ పి వి ఇన్ఫెక్షన్ గ్రే ముందు రక్షణ కల్పించడానికి ఈ వ్యాక్సిను ఉపయోగపడుతుంది అని, ఈ హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా నివారించవచ్చునని జె శ్రీనివాసులు చెప్పారు. బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి నుండి మంచి రక్షణ లభిస్తుందని, 14 నుండి 15 సంవత్సరంలోపు అమ్మాయిలు హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో గర్భాశ ముఖద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా నివారిస్తుందని తెలియజేశారు. ఈ హెచ్ పి వి టి గా ఇతర సాధారణతీకాల మాదిరిగానే ఒక ఆరోగ్య రక్షణ చర్య అని, మనం చిన్న వయసులోనే అనేక వ్యాధులకు టీకాలు తీసుకుంటాం, అదేవిధంగా హెచ్పీవీ వ్యాక్స్ అని కూడా భవిష్యత్తులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకునే ముఖ్యమైన టీ కానీ జై శ్రీనివాసులు చెప్పారు. ఈ టీకా తీసుకున్న తర్వాత కొంతమందికి టీకా వేసిన చోట కొద్దిగా నొప్పి లేదా వాపు రావచ్చు అని, తేలికపాటి జ్వరము రావచ్చని, ఈ పరిస్థిలో పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుందని తెలియజేశారు.
” *నివారణనే ఉత్తమమైన* *ఆరోగ్య రక్షా* ” అని హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు తెలియజేశారు. ఈరోజు ఆధారులు తెచ్చుకున్న 20 మంది విద్యార్థినిలకు హెచ్ పి వి వాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని జె.శ్రీనివాసులు తెలియజేశారు. డాక్టర్ దినేష్ మాట్లాడుతూ హెచ్ పి వి టీకా వ్యాక్సిన్ వైరస్ కు యాంటిజన్ గా పనిచేస్తుంది అని, మన శరీరంలో హెచ్ పి వి వైరస్ ఎంటర్ అయినప్పుడు, ఈ హెచ్ పీవీ టీకా తీసుకున్న తర్వాత వైరస్ కు యాంటీజను గా పనిచేసి క్యాన్సర్ వ్యాధిని రాకుండా నివారిస్తుంది అని తెలియజేశారు. ఈ హెచ్ పి వి టీకా మన శరీరంలో యాంటీ బాడీస్ ను తయారు చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దినేష్ హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు ప్రభుత్వ కుంట హైస్కూల్ హెడ్మాస్టర్ భాగ్యమ్మ, మరియు స్కూల్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు భారతి,సుకేలే, ఆశాలు, స్కూల్ విద్యార్థినులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: