బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తొర్రూరులో భక్తి పారవశ్యంలో శ్రీ మట్టి గణపయ్య నిమజ్జనోత్సవం

Homeతెలంగాణ

తొర్రూరులో భక్తి పారవశ్యంలో శ్రీ మట్టి గణపయ్య నిమజ్జనోత్సవం

తొర్రూరులో భక్తి పారవశ్యంలో శ్రీ మట్టి గణపయ్య నిమజ్జనోత్సవం నమస్తే భారత్:-తొర్రూరు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మరియు టీపీసీసీ వై

అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రైతు వేదికలు..! -జిల్లా అధికారుల స్పందించాలి..
ప్రభుత్వ హామీల సాధన కోసం చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి టిజిఇజేఏసి అడిషనల్ సెక్రటరీ జనరల్ కీసర రమేష్ రెడ్డి
పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..!

తొర్రూరులో భక్తి పారవశ్యంలో శ్రీ మట్టి గణపయ్య నిమజ్జనోత్సవం

నమస్తే భారత్:-తొర్రూరు

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో తొర్రూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా ముగిశాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ప్రతిష్ఠించిన శ్రీ మట్టి గణపయ్య నిమజ్జన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.నిమజ్జనానికి ముందు గణపయ్యకు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, గణపతి నామస్మరణల మధ్య శోభాయాత్రను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.మాట్లాడుతూ.పర్యావరణాన్ని కాపాడే మట్టి గణపతుల ప్రతిష్ఠాపన ప్రతి ఇంటా ఆదర్శంగా మారాలని, విఘ్నేశ్వరుడి కృపతో పాలకుర్తి నియోజకవర్గ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సుభిక్షం, అభివృద్ధి నిండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు పట్టణ ప్రజాప్రతినిధులు, మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు, యువత, కార్యకర్తలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని నిమజ్జనోత్సవాన్ని విజయవంతం చేశారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: