*షాద్‌నగర్‌లో తొలిసారి గణేశ్ ఉత్సవ చెస్ ఛాంపియన్‌షిప్* *చదరంగ పోటీలకు మల్లికార్జున కాలనీ పతంజలి యోగా మందిర్ హాల్ వేదిక* *బాలబాలికల మేధాశక్తికి
*షాద్‌నగర్‌లో తొలిసారి గణేశ్ ఉత్సవ చెస్ ఛాంపియన్‌షిప్*
*చదరంగ పోటీలకు మల్లికార్జున కాలనీ పతంజలి యోగా మందిర్ హాల్ వేదిక*
*బాలబాలికల మేధాశక్తికి చెస్ ఛాంపియన్‌షిప్-2026*
నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్21:షాద్‌నగర్ పట్టణంలో తొలిసారిగా గణేశ్ ఉత్సవ చెస్ ఛాంపియన్‌షిప్–2026 నిర్వహించనున్నారు. షాద్‌నగర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 27న మల్లికార్జున కాలనీలోని పతంజలి యోగా మందిర్ హాల్‌లో పోటీలు జరగనున్నాయి. ఉదయం 8.30 గంటలకు క్రీడాకారుల రిపోర్టింగ్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. 9 గంటలకు ప్రారంభమయ్యే పోటీలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. అండర్–8 నుంచి అండర్–16 వరకు ఐదు విభాగాల్లో బాలబాలికలు పోటీల్లో పాల్గొననున్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు మెమెంటోలు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి సర్టిఫికెట్, మెడల్ అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. చెస్ ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం పెంపొందించడమే లక్ష్యంగా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 26న సాయంత్రం 4 గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు వానరసి జగన్ కోరారు. మరిన్ని వివరాల కోసం 93468 43126 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

COMMENTS