బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*ఉట్కూర్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి*

Homeతెలంగాణ.

*ఉట్కూర్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి*

*ఉట్కూర్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి* నమస్తే భరత్,, 20/9/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
వామపక్ష విద్యార్థి సంఘా నాయకులపై పెట్టిన కేసును వెంటనే వెతివేయాలి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య డిమాండ్
హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శక్తి జ్యువలర్స్ సౌజన్యంతో షాపూర్ నగర్ డివిజన్ సంజయ్ గాంధీ నగర్లో కుత్బుల్లాపూర్ మండలం,

*ఉట్కూర్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి*

నమస్తే భరత్,, 20/9/2026/ నారాయణపేట జిల్లా
మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండల కేంద్రంలో బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….ఉట్కూర్‌లో ఇంత పెద్ద స్థాయిలో మెగా హెల్త్ క్యాంపును తొలిసారిగా ఏర్పాటు చేసిన బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సేవ చేసే గుణం కొందరికే ఉంటుందని,మనం చేసిన సేవే మనలను కాపాడుతుందని మంత్రి అన్నారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేద, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఈ సందర్బంగా పేద పిల్లలకు డిజిటల్ పలకలు, రోగులకు మందులు, దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు ఉట్కూర్ గ్రామ సర్పంచ్ రేణుక, బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణా రెడ్డి, సూర్య ప్రకాష్ రెడ్డి , విగ్నేశ్వర్ రెడ్డి, మరియు నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: