ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలి.మమతా రాణికి శుభాకాంక్షలు జనసేన ఎంపీటీసీ విజేతను ఘనంగా సత్కరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చ
ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలి.మమతా రాణికి శుభాకాంక్షలు
జనసేన ఎంపీటీసీ విజేతను ఘనంగా సత్కరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు
జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 10 ( ప్రేమ్ కిరణ్ )
ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి తరఫున పట్టెన్నపాలెం ఎంపీటీసీ అభ్యర్థినిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆకుల మమతా రాణికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు అభినందనలు తెలియజేశారు. జనసేన పార్టీ జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షుడు ఆకుల రాకేష్ సతీమణి అయిన మమతా రాణి, ఈరోజు శ్రీనివాసపురంలో డా. దాసరి శ్యామ్ చంద్ర శేషును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు టీడీపీ నాయకులతో కలిసి ఎంపీటీసీ విజేత ఆకుల మమతా రాణి, ఆమె భర్త ఆకుల రాకేష్ దంపతులను దుశ్శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా స్వీకరించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కూటమి అభ్యర్థిగా విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఏలికే ప్రసాద్, మాజీ అధ్యక్షుడు పోల్నాటి సత్యనారాయణ, క్లస్టర్ ఇన్‌చార్జి రాగాని శ్రీను, జనసేన పార్టీ అధ్యక్షుడు ఏలికే తాతారావు, పోల్నాటి పెంటరావు, తడికల దావీదు, జొన్నకూటి శ్రీను, రాగాని రామకృష్ణ, తన్నీరు శ్రీను, దాసరి సత్యనారాయణ, పిప్పర లక్ష్మణరావు, బాలం రాంబాబు, మల్లబత్తుల చెల్లారావు, తన్నీరు బుజ్జి, తాడిగడప శ్రీనివాస్ తదితర టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని మమతా రాణి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

COMMENTS