బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

విద్యాశాఖకు కేటాయించిన రూ.71,071 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు?   బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిని శ్రీనివాస్ గౌడ్

Homeతెలంగాణ

విద్యాశాఖకు కేటాయించిన రూ.71,071 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు? బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిని శ్రీనివాస్ గౌడ్

విద్యాశాఖకు కేటాయించిన రూ.71,071 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు? బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ వరంగల్ నవంబర్

పారిశుద్ధ్య కార్మికులకు ప్రకాషన్న దీపావళి కానుక
ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లతో పాటు ఆయకట్టు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
సిఇసి జ్ఞానేష్ కుమార్ ను విధులనుండి తొలగించాలి 2023 చట్టాన్ని రద్దు చేయాలి

విద్యాశాఖకు కేటాయించిన రూ.71,071 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు?

బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ
బత్తిని శ్రీనివాస్ గౌడ్

వరంగల్ నవంబర్ 10( మల్లేష్ నమస్తే భారత్ ) : విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యారంగాన్ని ఉద్ధరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని, మరి విద్యాశాఖకు కేటాయించిన నిధులు, విద్యార్థులకు మరియు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలు పరిస్థితి ఏమిటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ 2024 నుంచి 2026 వరకు విద్యాశాఖకు కేటాయించినట్లు పేర్కొన్న బడ్జెట్ వివరాలను ఆయన వెల్లడించారు.
– 2024 సంవత్సరం: రూ.21,292 కోట్లు
– 2025 సంవత్సరం: రూ.23,108 కోట్లు
– 2026 సంవత్సరం: రూ.26,674 కోట్లు మొత్తంగా మూడు సంవత్సరాల్లో రూ.71,074 కోట్లు కేటాయించినట్లు ఈ లెక్కలు సూచిస్తున్నాయని, ఈ నిధులను ఏయే కార్యక్రమాలకు ఖర్చు చేశారు? పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ఎంత వినియోగించారు? విద్యార్థులకు అందించిన ప్రయోజనాలేమిటి? అనే అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వివరించాలని బత్తిని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన 12 హామీల అమలు ఏది అని ప్రశ్నించారు.2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభయహస్తం హామీల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు సంబంధించి అనేక హామీలు ఉన్నాయని, వాటి అమలు పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. యువత కోసం ప్రకటించిన యువ వికాసం పథకం ఏమైంది?. కళాశాల విద్యార్థులకు ప్రకటించిన రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడుంది?. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైంది?. ఐఐటీ, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాల ఏర్పాటు ఏమైంది?. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైంది?. 18 సంవత్సరాలు నిండిన కళాశాల విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు అందిస్తామన్న హామీ ఏమైంది?. రాష్ట్రంలోని 65 ఐటీఐ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారుస్తామన్న ప్రకటన అమలు ఎంతవరకు వచ్చింది?. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల భవనాలు నిర్మిస్తామన్న హామీ ఏమైంది?. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్న హామీ ఏమైంది?. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైంది?. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దుతామన్న ప్రకటన ఏమైంది?.
ఉన్నత విద్యను అభ్యసించిన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తామన్న హామీ ఏమైంది అని ప్రశ్నించారు.ాకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ప్రకటించిన అనేక హామీల అమలుపై విద్యార్థులు, నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందని బత్తిని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. హామీల అమలుకు నిధులు కేటాయించారా? కేటాయించిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారు? ఎన్ని పథకాలు ప్రారంభించారు? ఎంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు లబ్ధి పొందారు? అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ముడిపడిన అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు.
భావి భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించే విద్యార్థులు, యువతకు సరైన విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పనితీరును ప్రజలు, విద్యావంతులు, మేధావులు నిశితంగా పరిశీలించాలని, ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెప్పాలని బత్తిని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0