బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కార్మిక కర్షక వర్గాలన్నీ కదలండి

Homeతెలంగాణ.

కార్మిక కర్షక వర్గాలన్నీ కదలండి

కార్మిక కర్షక వర్గాలన్నీ కదలండి రైతు సంఘం అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి దుండివీరన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నమస్తే భారత్ :-మరిపెడ

సీతారాంపురంలో ఘనంగా గణపయ్య లడ్డూ వేలం పాటలో రూ.35,216లకు లడ్డూను దక్కించుకున్న అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులు
పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత
మొక్కలను నాటి సంరక్షించుకుందాం.. -బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి..

కార్మిక కర్షక వర్గాలన్నీ కదలండి

రైతు సంఘం అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి

దుండివీరన్న
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి

నమస్తే భారత్ :-మరిపెడ

దేశంలో కార్పొరేట్ తిమింగలాలు వ్యవసాయ రంగాన్ని కబలించేందుకు కుట్రపూరితంగా ముందుకు వస్తున్నాయని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ వారికి వత్తాసు పలుకుతున్నాడని, దేశ రైతాంగాన్ని, భూములను వ్యవసాయ రంగాన్ని రక్షించుకునేందుకు ప్రజలు సంసిద్ధం కావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న ఏఐకేఎస్ 36వ అఖిల భారత మహాసభల సందర్భంగా మరిపెడ బంగ్లాలో సిఐటియు మండల కమిటీ కొండా ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా సహాయకార్యదర్శి దుండి వీరన్న పాల్గొని వారుమాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 80 ఏళ్ల కాలంలో నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల తయారీలో కార్పొరేట్ సంస్థలు స్థిరపడ్డాయని అన్నారు. ఇప్పుడు భూములను కదిలించేందుకు ముందుకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎస్ స్వామినాథన్ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయకుండా పాలకవర్గాలు నిర్లక్ష్యంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేత సుందరయ్య ప్రశ్నించిన చర్చించిన నేపథ్యంలోనే నెహ్రూ ప్రభుత్వం దేశంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు వచ్చిందని అన్నారు. నేడు రైతాంగానికి భూమిని కాపాడు కోవడమే సవాల్ గా మారిందని అన్నారు. ప్రభుత్వములను కార్పోరేటుకు అప్పగించిన పాలకవర్గాలు నేడు తాజాగా అభివృద్ధి సంక్షేమం పేరుతో రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వే ప్రాజెక్టులు, ఆసుపత్రులు పేరుతో రైతుల భూములను కొల్లగొడుతున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం మూడు పంటలు, రెండు పంటలు పండే భూములను అభివృద్ధి సంక్షేమం పేరుతో సేకరించవద్దని కేవలం పంటలు పండని భూములను సేకరించాలని అత్యవసర మౌలిక సదుపాయాల కోసం అయితే ఏకపంట భూములను సేకరించవచ్చు అని అదికూడా మార్కెట్ రేట్ ప్రకారం మూడు రేట్లు అదనంగా ఇచ్చి తీసుకోవాలని అన్నారు. దేశంలో 4500 మంది రైతులు చనిపోయారని మానుకోట జిల్లాలో 22 మంది రైతులు చనిపోయారని ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని అన్నారు. రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ పేరుతో బహుళ జాతి సంస్థలకు భూములను అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. నిరుద్యోగ పాలకవర్గాలు దేశీయ ఎరువుల కర్మాగారాలను విత్తన కంపెనీలను విత్తన తయారీ సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ కార్పొరేట్ రంగాలకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని విమర్శించారు. రైతులు వాడుకునే సేంద్రియ ఎరువులను పక్కనపెట్టి కార్పొరేట్ ఎరువులు వచ్చాయని రైతులు వాడుకునే విత్తన రంగ తయారీలో కూడా కార్పొరేట్లు జొరబడ్డారని , వ్యవసాయ సాగులో కూడా భారీ యంత్రాలు వచ్చాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీల సూచనల మేరకే ఎమ్మెస్ స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. ప్రతిపక్షాల పోరాటాల ఫలితంగానే బ్యాంకుల జాతీయకరణ జరిగిందని రైతులకు 40 శాతం వ్యవసారంగానికి రుణాలు ఇవ్వడానికి అందులో 18 శాతం పంట రుణాలు ఇవ్వడానికి ఒప్పందం జరిగిందని అన్నారు. పోరాటాల ఫలితంగానే రాష్ట్రంలో రుణమాఫీ జరిగిందని ఉచిత విద్యుత్ అమల్లోకి వచ్చిందని అన్నారు. దేశంలో రాష్ట్రంలో రైతాంగానికి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని అది కార్పొరేట్ వ్యవసాయం రాబోతుందని భూములను కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతుందని అన్నారు. కార్పొరేట్ రంగాల నుంచి పాలకవర్గాల విధానాల నుంచి భూములను కాపాడుకునేందుకు రైతాంగం సిద్ధం కావాలని అన్నారు. ఈనెల 15 నుంచి నల్గొండలో జరిగే రైతు సంఘ అఖిలభారత మహాసభలకు కార్మికులు కర్షకులు రైతులు భారీ సంఖ్యలో తరలిరావాలని 15న నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కొండ ఉప్పలయ్య కాగిత రాంబాబు సొరవైన బిక్షం వెంకన్న సైదులు జామ్మూర్తి సుంకరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: