*బాచుపల్లి నిజాంపేట్ రోడ్లపై వేలాడుతున్న కేబుల్ వైర్లు భయంలో వాహనదారులు,పాదచారులు* నమస్తే భారత్ : నిజాంపేట్ విలేకరి బాచుపల్లి మండల పరిధిలోని బాచ
*బాచుపల్లి నిజాంపేట్ రోడ్లపై వేలాడుతున్న కేబుల్ వైర్లు భయంలో వాహనదారులు,పాదచారులు*
నమస్తే భారత్ : నిజాంపేట్ విలేకరి
బాచుపల్లి మండల పరిధిలోని బాచుపల్లి,నిజాంపేట్,ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై ఇంటర్నెట్, నెట్వర్క్ కేబుల్ వైర్లు తీవ్ర అవ్యవస్థీకృతంగా పడి ఉండటం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రోడ్ల పక్కన, రహదారుల మధ్యలో కొన్నిచోట్ల ఈ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతుండటంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.సంబంధిత నెట్వర్క్ ప్రొవైడర్ సంస్థలు కేబుళ్లను అమర్చిన తర్వాత వాటి నిర్వహణను పూర్తిగా విస్మరించడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు.రహదారులపై ఎక్కడపడితే అక్కడ అస్తవ్యస్తంగా పడి ఉన్న వైర్లు రాత్రి వేళల్లో సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల బైకర్లు ఈ వైర్లలో చిక్కుకుని కిందపడి గాయపడిన సంఘటనలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నెట్వర్క్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తక్షణమే స్పందించి రోడ్లపై వేలాడుతున్న కేబుల్ వైర్లను తొలగించాలని బాచుపల్లి, నిజాంపేట్ పరిసర ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వైర్లను క్రమబద్ధీకరించి, రోడ్డు భద్రతను నిర్ధారించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

COMMENTS